పాకిస్థాన్ కి బిగ్ షాక్.. బలూచిస్థాన్ స్వతంత్ర దేశం

75 ఏళ్ల  సుదీర్ఘ పోరాటం ఫ‌లించిన వేళ‌
అజిత్ దోవ‌ల్ అన్న మాట నిజ‌మైన సంద‌ర్భం! 

ఎట్ట‌కేల‌కు బ‌లూచిస్థాన్ స్వ‌తంత్ర దేశంగా ప్ర‌క‌టించుకుంది.ప్ర‌భుత్వ ఏర్పాట్ల‌కు స‌న్నాహాలు చేసుకుంటోంది. క్వెట్టాలో కొత్త పార్ల‌మెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకుంది. భార‌త్ స‌హా ప‌లు దేశాలు త‌మ దేశంలో యాంబ‌సీలు ఏర్పాటు చేసుకోవాల‌ని కోరింది. పాక్ నుంచి స్వాతంత్రం కోసం.. బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ స‌హా ప‌లు సంస్థ‌లు ద‌శ‌కాలుగా పోరాడుతున్నాయి. ఈ యుద్ధం సంద‌ర్బంగా వారి ఆశ‌లు ఆశ‌యాలు ఒక్క‌సారిగా  ఫ‌లించిన‌ట్ట‌య్యింది.

బ‌లూచిస్థాన్ ది 75 ఏళ్ల స్వ‌తంత్ర పోరాటం. ఖాన్ ఆఫ్ క‌లాత్ పాల‌న‌లో స్వేచ్ఛ‌గా ఉన్న ఈ రాజ్యం.. 1948లో బ‌ల‌వంతాన పాక్ ప్ర‌భుత్వ సైనిక చర్య ద్వారా ఆ దేశంలో క‌లిసింది. పాకిస్థాన్ భూభాగంలో 44 శాతం బ‌లూచిస్తాన్ దే. పాక్ జ‌నాభాలో వీరి  వంతు 7 నుంచి 8 శాతంగా ఉంది. ఇప్పుడు బ‌లూచిస్తాన్ విడిపోవ‌డం వ‌ల్ల పాక్ కి వ‌చ్చే న‌ష్టాలేంట‌ని చూస్తే.. 

మొద‌టిది నైస‌ర్గికంగా పాక్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతుంది. మొత్తం పాకిస్థాన్ లోనే 44 శాతం వేరు ప‌డడం అంటే దాదాపు స‌గానికి స‌గం దాని నైస‌ర్గిక ముఖ‌చిత్రమే మారిపోతుంది. దీనికి తోడు సింధ్, గిల్గిట్ బ‌ల్టిస్థాన్ సైతం.. వేరు ప‌డే అవ‌కాశాలున్నాయి.  దీంతో ఇది మ‌రో దెబ్బ‌గా క‌నిపిస్తోంది.

రెండో స‌మ‌స్య ఏంటంటే చైనా ఇన్నాళ్ల పాటు ఉచిత సాయాలు చేసిందే బ‌లూచిస్థాన్ని చూసి. ఇక్క‌డ డ్రాగన్ కంట్రీ ఇది వ‌ర‌కే హైబ్రిడ్ రోడ్లు వేసి, ట్రాకులు నిర్మించడం.. వాటిని బ‌లూచీలు ధ్వంసం చేస్తున్నార‌న్న ఆలోచ‌న కొద్దీ ఎయిర్ పోర్టు నిర్మించ‌డం వంటి ఎన్నో కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టింది.. అంతే కాకుండా గ్వ‌ద‌ర్ పోర్టు నిర్మించి చైనా ప‌డుతున్న పాట్లు మొత్తం బూడిద‌లో పోసిన  ప‌న్నీరే.  దీంతో ఇక‌పై పాక్ కి చైనా త‌న వ్యూహాత్మ‌క స‌హ‌కారం అందించే అవ‌కాశం లేక పోవ‌చ్చు.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రికి, చైనా విదేశాంగ మంత్రి.. మొన్న చెప్పిన మాట ఏంటంటే.. మీ దేశ సార్వ‌భౌమాధికారానికి ఇబ్బంది క‌లిగితే తాము అడ్డుకుంటామ‌ని.  అది పీఎల్ 15లు స‌ర‌ఫ‌రా చేసిందికూడా అందు కోస‌మే. అలాంటి స‌హాయ స‌హ‌కారాలు ఇక‌పై చైనా చేయ‌క పోవ‌చ్చు. కార‌ణ‌మేంటంటే.. చైనాకు కావ‌ల్సింది బ‌లూచిస్థాన్ అందులో ఉన్న అశేష విశేష ఖ‌నిజ సంప‌ద‌లు. అంతే కానీ, పాకిస్థాన్, దాని ప్రేరేపిత ఉగ్ర‌వాదం కోసం కాదు. ఇక‌పై చైనా ఏదైనా స‌హాయం చేయాల్సి వ‌స్తే నేరుగా బ‌లూచిస్తాన్ కే చేసే అవ‌కాశ‌ముంది.

దీంతో పాక్ కి ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ త‌గిలింద‌నే చెప్పాల్సి ఉంటుంది. ఒక్క బ‌లూచిస్తాన్ ని వేరు చేసుకోవ‌డం అంటే పాకిస్థాన్ దాదాపు స‌గం శ‌క్తిని కోల్పోయిన‌ట్టే. వారు మొన్నంటే మొన్న ఒక ట్రైన్ని హైజాక్ చేసి మ‌రీ త‌మ నిర‌స‌న తెలిపింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ. ఇటీవ‌ల భార‌త్ తో జ‌రిగిన యుద్ధంలోనూ క్వెట్టాలోని పాక్ ప్ర‌ధాన  సైనిక కార్యాల‌యాల‌పై దాడులు చేసి త‌రిమి త‌రిమి కొట్టింది బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ. ఎందుకంటే పాకిస్తానీయులు, బలూచి యువ‌త‌ను కిడ్నాప్ చేసి మ‌రీ.. త‌మ సైన్యంలో క‌లుపుకునేవారు. ఇలాంటి  ఎన్నో పాక్ అరాచ‌కాల నుంచి ప్రస్తుతం బ‌లూచిస్తాన్ బ‌య‌ట‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ విష‌యం అజిత్ దోవ‌ల్ ఎప్పుడో చెప్పారు. ఈ సారిగానీ ముంబై త‌ర‌హా దాడులు రిపీట్ అయితే.. మీ  నుంచి బ‌లూచిస్తాన్ వేరుప‌డ్డం ఖాయ‌మ‌ని. బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీకి సంబంధించిన కొంద‌రు వేర్పాటు వాదులు ఆఫ్గ‌నిస్తాన్ వెళ్లి అక్క‌డ సైనిక శిక్షణ  తీస్కుని మ‌రీ.. పాకిస్థాన్ తో పోరాడారు. బలూచిస్థాన్ ఇండిపెండెంట్ నేషన్ అయ్యిందంటే పాక్ రెక్క‌లు తెగిన‌ట్టే. ఇటు బ‌లూచిస్తాన్ పోయి అటు చైనా స‌పోర్టు కూడా క‌నుమ‌రుగు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu