కోపంలోనే అలా అన్నాను సారీ.. బలరాం నాయక్
posted on Oct 11, 2015 4:45PM
.jpg)
మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ తన ప్రసంగాలతో ఎప్పుడైనా ఫేమస్ అయ్యారో లేదో తెలియదు కాని రెండు రోజుల క్రితం ఆయన చేసిన ఒక వ్యాఖ్య వల్ల ఇప్పుడు ఫుల్లు గుర్తింపు వచ్చింది. అదేంటని అనుకుంటున్నారా అదే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ కు పట్టం కట్టారు..ఈసారి ఎన్నికల్లో తమను గెలిపించకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్సలు రావడంతో ఇప్పుడు సారీ చెప్పుతున్నారు. గత ఎన్నికల్లో నాకు అన్యాయం (ఓడించారు) జరిగిందన్న కోపంలోనే అలా అన్నానని.. ఏదిఏమైనా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని క్షమాపణ చెపుతున్నట్టు బలరాం నాయక్ అన్నారు.