బాబు విమర్శకులూ ఖబడ్దార్... బుద్ధా వెంకన్న సూసైడ్ బ్యాచ్ రెడీ!
posted on Apr 20, 2022 5:49PM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి జన్మదినం సందర్భంగా ఆయన ప్రత్యర్థులకు పార్టీ సీనియర్ నాయకుడు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీలో గుర్తింపు పొందాలంటే....చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై బురద జల్లడం, అవాకులు చెవాకులు పేలడమే మార్గ మన్న భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారనీ, అటువంటి వారు ఇక వారి నోట దూలకు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
చంద్రబాబు విమర్శకులపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. అనవసర వ్యాఖ్యలు, అసత్య విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరంచారు. చంద్రబాబు క్యారెక్టర్ అసాసనేషన్ కు పాల్పడితే చూస్తూ ఊరుకోమనీ, అటువంటి వారని అవసరమైతే చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా వంద మందితో ఆత్మాహుత బ్యాచ్ సిద్ధం అయి ఉందని బుద్ధా వెంకన్న వెల్లడించారు. చంద్రబాబుపై అవాకులు చెవాకులూ వాగడం, దాడులు చేయడం వైసీపీ నేతలకు పదవులు సంపాదించేందుకు అడ్డదారిగా మారిందని, అటువంటి వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని ఘాటుగా హెచ్చరంచారు.
పార్టీలో ఎందరో సీనియర్లు ఖాళీగా ఉండగా జోగి రమేష్ కే జగన్ మంత్రి పదవి ఎందుకిచ్చారో అందరికీ తెలిసిందేనని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ ఒకెత్తు ఇక నుంచి మరో ఎత్తు....ఎవరైనాసరే బాబుపై నోరు పారేసుకోంటే తీవ్ర పరిణామాలు ఎదురోవలసిందేనని తేటతెల్లం చేశారు.