అవినాష్ రెడ్డి అరెస్ట్ ఇక లాంఛనమే
posted on Apr 21, 2023 1:47PM
తెలంగాణ హైకోర్టు విధించిన 25వ తేదీ పరిమితిపై సుఫ్రింకోర్టు స్టే విధించింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యమైంది. ఏప్రిల్ 30వ తేదీలోకగా విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు పట్టించుకోక పోవడంపై వివేకా కుమార్తె సుప్రీంకోర్టు తలుపుతట్టారు. 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలులోనే ఉండగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అవినాష్ రెడ్డి వర్గాన్ని ఇరకాటంలో పడేశాయి.
కేసు కీలక దశలో ఉన్న తరుణంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ పై జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అవినాష్ రెడ్డి అనేక అనవసర కారణాలతో విచారణను అడ్డుకోవడమో... జాప్యం జరిగేటట్లు ప్రయత్నించడమో చేస్తున్నారని వైయస్ సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదననను.. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహన్‌తో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. సిద్ధార్థ వాదనలపై బెంచ్ తీర్పు వెలువరించింది.
తాజా పరిణామాలతో సీబీఐకి కొత్త బలం వచ్చినట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే.. సీబీఐకి క్షణాల్లో పని అనేది వారి వాదన. కాగా అవినాష్ న్యాయవాదుల విజ్ణప్తి మేరకు సుప్రీం కోర్టు ఆయనను సోమవారం వరకూ అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది.