ఐదోరోజు-అట్ల బతుకమ్మ

మనిషికి ప్రకృతితో గత విడదీయరాని సంబంధం ఉంది..ఓడిలో పడుకోబెట్టుకునే అమ్మగా..సేదతీర్చి సాంత్వన చేకూర్చే స్నేహితురాలు ప్రకృతి. అలాంటి ప్రకృతితో మమేకమయ్యే పండుగే బతుకమ్మ. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఈ నెల 20న ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు వాడవాడలా..అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ్టీకి ఐదో రోజుకు చేరుకున్నాయి బతుకమ్మ ఉత్సవాలు. ఈ రోజు జరుపుకునే పండుగను అట్ల బతుకమ్మ అంటారు. ఐదవ రోజున తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి పూలను అయిదు వరుసలుగా పేర్చి, బతుకమ్మను ఆడుతారు. ఈ రోజున దోసెలు వేసి వాయనంగా పంచిపెడతారు. రాత్రంతా బతుకమ్మ ఆడి పాడి నీటిలో వదిలి ఆ తర్వాత చేసిన ప్రసాదాన్ని అందరూ కలిసి తీసుకుంటారు.