సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 

సెప్టెంబర్ 18 నుంచి వర్షకాల శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు విడి విడిగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి.

ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాబోమని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలు హజరుకానిపక్షంలో అనర్హత వేటు పడుతుందని ఇప్పటికే డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతల్ని హెచ్చరించారు.

ఇలా ఉండగా, తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా శాసన సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు ఏపీ సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్నికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu