రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య
posted on Jun 1, 2025 11:13AM
.webp)
రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడపలో జరిగింది. కడప రైల్వే స్టేషన్ పరిధిలోని సిద్దవటం కనుమలోపల్లి వద్ద రైలు పట్టాలపై ఏఎస్ఐ బుక్కే పురుషోత్తమ్ నాయక్ మృత దేహాన్ని శనివారం (మే 31( కనుగోన్నారు. తన ఇంటి నుంచి శనివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్ కోసం అని చెప్పి బయటకు వెళ్లిన ఏఎస్ఐ పురుషోత్తమ్ నాయక్ కనుమల్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొన్నారు.
చక్రాయపేట మండలం కల్లూరు పల్లె తండా కు చెందిన ఏఎస్ఐ కడప పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఏఎస్ఐ పురుషోత్తం ఆత్మహత్యకు ఆరోగ్య సమస్యలే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పురుషోత్తమ్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంతరించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు, అనారోగ్యం కారణంగానే ఏఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు మృతుడి కుమారుడు విశ్వ క్సేన్ నాయక్ ఎక్సైజ్ శాఖలో డిఎస్పి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు.