గోవాకు అశోకగజపతి రాజు.. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
posted on Jul 25, 2025 2:05PM
.webp)
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిర రాజు శుక్రవారం (జులై 25) గోవాకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాకు బయలు దేరారు. గోవా గవర్నర్ గా నియమితులైన ఆయన శనివారం (జులై 26) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు విజయనగరం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గోవాకు చేరుకుంటున్నారు.
గోవా గవర్నర్ గా నియమితులైన తరువాత అశోకగజపతి రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన అశోకగజపతి రాజు పార్టీతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ తెలుగుదేశంతోనే ఉన్న అశోకగజపతి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం లోక్ సభ సస్థానం నుంచి ఒక సారి ఎంపీగా విజయం సాధించిన అశోకగజపతి రాజు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.