ఏపీలో ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారం : మంత్రి అనగాని

 

ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా భూ సమస్యలు పరిష్కారస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నారు. గ్రీవెన్స్ ద్వారా 4.63లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి  మాట్లాడారు. భూములకు ఆధార్‌, సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు