ఏపీ సచివాలయం 50 అంతస్తులు!
posted on Aug 7, 2015 12:07PM
.jpg)
ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యలయాల నిర్మాణానికి గాను, వాటికి సంబధించిన ప్రణాళికకు గాను ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల రోజుల్లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలను ఏపీ ప్రభుత్వం అక్కడి నుండి ఇక్కడికి తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా పాలన చేయాలనే ఉద్దేశంతో ముందుగా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ముందుగా అమరావతిలో ఫేజ్-1 భాగమైన అసెంబ్లీ, సచివాలయం, ప్రధాన కార్యాలయాలు, ఉద్యోగుల గృహాలు తదితర భవనాల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టేందుకు సీఆర్‌డీఏ సన్నద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలను ప్రపంచస్థాయి కట్టడాలుగా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలో సచివాలయాన్ని 50 అంతస్తుల్లో విశాలమైన గదులతో.. అందే విధంగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని దీనిలోనే 47 లేదా 48వ అంతస్తులో నిర్మించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి సరైన డిజైన్ ను ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. అయితే మరో రెండు మూడు రోజుల్లో వీటిలో ఒక మంచి సంస్థకు ఈ డిజైనింగ్ బాధ్యతను ఇవ్వనున్నారు. అంతేకాదు అసెంబ్లీని కూడా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించాలని భావిస్తున్నారు.