అయ్య‌న్న ఇంటిచుట్టూ తిర‌గ‌వ‌ద్దుః పోలీసుల‌కు కోర్టు మంద‌లింపు

ఎవ‌ర‌న్నా దేవుడి గుడిలో ప్ర‌ద‌క్షిణాలు చేస్తారు,  పోనీ ఉత్స‌వ విగ్ర‌హం చుట్టూ తిరుగుతారు.  కేసుల్లో వున్న‌వారి ఇంటిచుట్టూ పోలీసులు తిరుగుతారు. అస‌లు ఏ కేసూ లేండానే మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడి ఇంటి చుట్టూ పోలీసుల ప్ర‌ద‌క్షిణని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు నిల‌దీసింది. ఆయ‌న ఇంటికి  వెళు తూండ‌డంతో ఆయ‌న వ్య‌క్తిగ‌త స్నేచ్ఛ‌ను అడ్డుకోవ‌డానికి ఏ చ‌ట్టం అంగీక‌రించ‌ద‌ని తేల్చింది. ఒక‌వేళ ఏద‌యినా కేసు న‌మోదైన ప‌క్షంలో చ‌ట్ట‌నింబంధ‌న‌ల మేర‌కే  పోలీసులు న‌డుచుకోవాల‌ని  కోర్టు స్ప‌ష్టం చేసింది.  అంతేగాక ఆయ‌న‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ‌పోలీసు స్టేష‌న్ల‌లో న‌మోదైన కేసుల వివ‌రాల‌ను కోర్టు ముందుంచాల‌ని హోంశాఖ‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్ర నాథ్‌ రాయ్‌ గురు వారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.  

ఎక్క‌డ‌యినా కేసు న‌మోద‌యితే పోలీసులు సంబంధితుల‌కు ఎఫ్ ఐ ఆర్ ఇస్తారు. కానీ  త‌న‌పై న‌మోదైన కేసుల ఎఫ్ ఐఆర్ లు పోలీసులు ఇవ్వ‌డంలే దని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు  పేర్కొం టూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇక‌పై త‌న వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను అడ్డుకోకుండా పోలీసుల‌ను నిలువ‌రిం చాల‌నీ, ఎఫ్ ఐ ఆర్ కాపీల‌ను ఇచ్చేలా ఆదే శించాల‌ని టిడీపి మాజీమంత్రి పాత్రుడు అభ్య‌ర్ధించారు. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వీవీ స‌తీష్ వాద నలు వినిపించారు.  పిటిష‌న‌ర్ ప్ర‌తిప‌క్షానికి చెందిన నాయ కుడు ఆయ‌న  జూన్ 15 న చోడ‌వ‌రం మినీ మ‌హా నాడులో ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అప్ప‌టినుంచే ఆయ‌న నివాసం చుట్టూ పోలీసులు ప్ర‌ద‌క్షిణాలు చేస్తున్నారని స‌తీష్ అన్నారు.  న్యాయ పరంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచు కునేందుకు పిటిషనర్‌పై నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను కూడా పోలీసులు ఇవ్వడం లేదని కోర్టు దృష్టి కి తీసుకొచ్చారు. 

ఇదిలా వుండ‌గా,  పిటిషనర్‌పై తాము ఎలాంటి కేసులూ నమోదు చేయ లేదని సీఐడీ తరఫు న్యాయవాది తెలిపారు. అయ్యన్నపై  శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, అల్లూ రు సీతారామరాజు  జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కాలేదని హోంశాఖ తరఫు  ప్రభుత్వ న్యాయవాది  మహే శ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర జిల్లాలోని కేసుల వివరాలు సమర్పించేందుకు  సమయం కోరారు.   

న్యాయమూర్తి స్పందిస్తూ,  కేసు నమోదు చేయకుండా పిటిషనర్‌ నివాసం చుట్టూ పోలీసులు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఇతర కేసుల విషయంలో వారు వెళ్లి ఉంటారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. అయ్యన్న తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన ఇతర ఎఫ్‌ఐఆర్‌ల విష యంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, సెక్షన్‌ 41ఏ  నిబంధనలు పాటించాలని, తదుపరి చర్యలు తీసుకోవద్దని పేర్కొందని గుర్తుచేశారు. 

ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రముఖ ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రసారం చేస్తున్నారని తెలిపారు.  ఆ కథనాల ఆధారంగా వ్యాజ్యాలు ఎలా వేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలను  పరిగణ నలోకి తీసుకుని.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పోలీసులకు స్పష్టం చేశారు.