నేను రాను.... కోర్టుకు రావడం కుదరదని హై కోర్టులో పిటిషన్ వేసిన జగన్
posted on Jan 27, 2020 4:16PM

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు వెల్లడించింది. అయితే పలు మార్లు జగన్ తనకు రావడం వీలుపడదని తన బదులు తన సంబంధిత లాయర్లు హజరవుతారని పిటిషన్ పెట్టగా ప్రతిసారి కోర్టులో జగన్ కు చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరు పై మినహాయింపు దక్కకపోవడంతో ఏపీ సీఎం జగన్ హైకోర్టు ను ఆశ్రయించారు. సిబిఐ కోర్టు తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించడం పై సవాల్ చేశారు. ఏపీ సీఎంగా పరిపాలనా పరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తమపై ఉందని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ప్రతి పక్ష నేతగా ఉన్నప్పుడు జగన హైకోర్టులో ఇదే పిటిషన్ వేయగా సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ అప్పట్లో హై కోర్టు ఆదేశించింది. మరి ఏపీ సీఎం జగన్ కు ఈ పిటిషన్ అయినా ఊరటనిస్తుందో లేదో వేచి చూడాలి.