ఏపీకి పెద్ద బిస్కెట్
posted on Sep 8, 2015 4:07PM

ఏపీ రాజధానిలో అనేక పరిశ్రమలు పెట్టడానికి సింగపూర్ జపాన్ తో పాటు ఇంకా అనేక కంపెనీలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిస్కెట్ వ్యాపార రంగంలోనే అగ్రస్థానంలో ఉన్న బ్రిటానియా సంస్థ కూడా ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు, కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.
అయితే సదరు బ్రిటానియా కంపెనీ ఎంపీ వరుణ్ బెర్రీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అవసరాల కోసం అనువైన ప్రాంతాన్ని చూస్తుండగా ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును సంప్రదించగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పేరును చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి బ్రిటానియా ఎండీ కూడా ఓకే చెప్పేడంతో రూ.125కోట్లు పెట్టుబడతో వచ్చే ఏడాది చివరి నుంచి తమ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.