అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం.. తీర్మానానికి వైసీపీ మద్దతు..
posted on Mar 16, 2016 6:19PM
.jpg)
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విభజన సందర్భంగా పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని.. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ మొత్తం 17 అంశాలను అమలు చేయాలని కోరుతూ తీర్మానం పెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో.. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తామని ఆనాడు పార్లమెంట్లో హామీ ఇచ్చారు.. ఇప్పుడు పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా ప్రత్యేక హోదా అంశం బిల్లులో చేర్చలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు.
అంతేకాదు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిచాలి.. కేంద్రం సహరిస్తే 2018 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది.. ఇప్పటికి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 645 కోట్లు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 1449 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచాలని కోరామన్నారు. సగటున ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున సీట్లు పెరుగుతాయని చెప్పారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ.. రాష్ర్టానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వ తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందని.. చంద్రబాబుపై నమ్మకం లేకపోయినా మద్దతిస్తున్నామని అన్నారు. గడ ఏడాది కూడా ఇలాగే తీర్మానం పెట్టారు.. ఆమోదం పొందింది.. కేంద్రానికి పంపారు ఏ జరిగంది.. ఈరోజు ఇంకొక తీర్మానం చేసి పంపుతున్నామని అంటున్నారు.. ఇది ఏమవుతుందో చూడాలి అని వ్యాఖ్యానించారు.