వైసీపీ పై చంద్రబాబు ఫైర్.. ఇద్దరు వైసీపీ నేతలు సస్పెన్షన్..!


వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కాల్ మనీపై రేపు చర్చిద్దామని.. దీనిపై రేపు ప్రకటన చేస్తాం.. కాల్ మనీ వ్యవహారంలో ఎవరిని వదలం..నా ప్రకటన తర్వాత చర్చించి సాక్ష్యాలివ్వండి.. దోషులను శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని..దోషులు ఏపార్టీవారైనా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు సభలో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి..అంబేద్కర్ పై చర్చించాల్సిన అవసరం ఉంది..నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకునేనా వైసీపీ నేతల వ్యవహారం ఉందని అన్నారు. సభ సజావుగా సాగేందుకు వైసీపీ నేతలు సహకరించాలని సూచించారు. అయినా వైసీపీ నేతలు వినకపోవడంతో స్పీకర్ ఆపార్టీకి చెందిన ఇద్దరు నేతలు శివప్రసాద్ రెడ్డిని, రామలింగేశ్వరరావుని రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు.