రెండేళ్ళలో రెండో ఇన్నింగ్స్!
posted on Feb 28, 2013 2:16PM

టాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క త్వరలో పెళ్ళికూతురు కాబోతుందట. ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్. 2015 లో అనుష్క పెళ్ళి చేసుకోబోతుందనే వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది! అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం చేస్తున్న భారీ చిత్రం 'బహుబలి', గుణ శేఖర్ నిర్మిస్తున్న 'రుద్రమదేవి' సినిమాలో నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లు పూర్తైన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి 'బహుబలి' కంప్లీట్ అయ్యేసరికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది. కానుక అనుష్క పెళ్ళి 2015 లో ఖాయమనె వార్తలు వినిపిస్తున్నాయి.
అనుష్క పెళ్ళి గురించి గత౦లోనే కుటుంబ సభ్యులు ఆమెతో చర్చించారు. అప్పుడు అనుష్క కి చాలా సినిమాలు చేతిలో ఉండడం కారణ౦గా పోస్ట్ పోన్ చేశారు. అనుష్క బంధువుల అబ్బాయి తోనే ఆమె పెళ్ళి జరనుందని సమాచారం. మొత్తానికి అనుష్క రెండేళ్ళ లో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది.