‘26/11 ఇండియాపై దాడి' వర్మ మూవీ టాక్
posted on Mar 1, 2013 7:39PM

వాస్తవ కథనాల్ని తెరకెక్కించటానికి రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాడు. ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ నుంచి చాలా సినిమాలు వచ్చిన తన మార్క్ ను చూపించలేకపోయారు . అయితే చాలా మంది రామ్ గోపాల్ వర్మ సినిమాలకు గుడ్ బై చెప్తే మంచిది అనుకుంటున్న టైంలో...ముంబై దాడుల ఘటనను వెండి తెరపై ‘26/11 ఇండియాపై దాడి' అనే టైటిల్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు.
ముంబై దాడుల ఘటనను చిత్రీకరించడంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు అంటున్నారు విమర్శకులు. ముఖ్యంగా ముంబై హోటల్ లో దాడి జరిగిన సన్నివేశాలను వర్మ అద్భుతంగా తెరకేక్కించాడని చెబుతున్నారు. ఈ సినిమాలో నానా పటేకర్ యాక్టింగ్, అతని వాయిస్ మెయిన్ హైలైట్ గా చెప్పవచ్చు. అజ్మల్ కసబ్ గా సంజీవ్ జైస్వాల్ నటన ఆకట్టుకుంటుంది. సా౦కేతికంగా కాకుండా అన్ని అంశాల్లోనూ వర్మ పకడ్బందీగా చిత్రాన్ని ముందుకు నడిపించారు. ఈ సినిమా వర్మ ను మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది.