అనుష్కది చాలా విశాలం!
posted on Sep 24, 2012 5:33PM

అవును.. నిజంగా అనుష్కది.. చాలా... విశాలం.. ఎంత విశాలం కాకపోతే.. అమ్మడు మరి తన డ్రైవర్ని అంతగా ఎలా కరుణిస్తుంది. అనుష్క తన పుట్టిన రోజునాడు డ్రైవర్ చాలామంచి నజరానా ఇచ్చిందని ఇండస్ట్రీమొత్తం కోడై కూస్తోంది. ఎంత సీక్రెట్ గా చేద్దామన్నా నిప్పులాంటి నిజాన్ని దాచిపెట్టడం కుదరలేదు. లక్షల విలువచేసే కారుని చాలా నమ్మకస్తుడైన డ్రైవర్ కి అనుష్క గిఫ్ట్ గా ఇవ్వడం ఇండస్ట్రీలో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. డ్రైవర్ కి అంత ఖరీదైన కారుని కానుకగా ఇచ్చిన హీరోయిన్ ఇంత వరకూ ఇండస్ట్రీ చరిత్రలోనే లేదని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చేయితిరిగిన పనితనం ఉన్న తన పనివాళ్లంటే స్వీటీకి.. (ఇది అనుష్క ముద్దుపేరు లెండి) చాలా ఇష్టమట. అందుకే పర్సనల్ కెమెరా మెన్ విషయంలో తమిళసినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి టెక్నీషిన్లతో గొడవపడి వాళ్లంతా మీదపడేవరకూ పరిస్థితి వచ్చిందంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. అనుష్కకి తన స్టాఫ్ అంటే ఎంతిష్టమో..!