ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు

 

సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ‘పేపర్ లెస్ మీటింగ్’గా జరిగిన ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, ఐ ప్యాడ్లతోనే సమావేశం జరిగింది. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది.

 

* చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో హోండా పరిశ్రమ ఏర్పాటుకు 600 ఎకరాల భూమి కేటాయింపు.

 

* ప్రభుత్వ పథకాల అమలు తీరు పర్యవేక్షణకు గ్రామ, మండల, మునిసిపల్, జిల్లా స్థాయుల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటు.

 

* అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరంతర విద్యుత్ అమలు ప్రారంభం.

 

* అక్టోబర్ 2వ తేదీన ఎన్టీఆర్ సుజల స్రవంతి, వృద్ధాప్య పెన్షన్ల పెంపు ప్రారంభం.

 

* విద్యాశాఖకు ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలని సూచన.

 

* అవాంతరాలు తొలగిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల.

 

* అక్టోబర్ మొదటివారం నుంచి రుణమాఫీ అమలు.

 

* అక్టోబర్ 2 లోగా ఎన్టీఆర్ క్యాంటిన్ల ఏర్పాటుపై చర్చ.

 

* మంత్రులు ఎవరి పనితీరు వారే సమీక్షించుకుని ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu