ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

వైకాపా సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ప్రత్యేక హోదా పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన చేస్తున్న సమయంలో వైకాపా సభ్యులు ఆయనకు అడ్డు తగిలారు. ప్రకటన చేయకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుమట్టి నినాదాలు చేశారు.ఈ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు,తెదేపా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్,మంత్రులు యనమల రామకృష్ణుడు,అచ్చెన్నాయుడు వైకాపా సభ్యులను వారించారు.ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగించేలా సహకరించాలని కోరారు.అయినప్పటికీ వారు వినకుండా అందోళన కొనసాగించారు.దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu