యూపీ సర్కారుతో అమితాబ్ కి తలనొప్పులు.. ముందుగానే మేల్కొన్నారు
posted on Oct 21, 2015 5:41PM
.jpg)
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు రూ 50,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా విమర్శలు తలెత్తాయి. స్వాతంత్ర్య సమరయోధుల కంటే ఈ పెన్షన్ భారీగా ఉండటం.. బిగ్ బీ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న నేపథ్యంలో ఇంత భారీ పెన్షన్ ను కేటాయించడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా వివాదాస్పదం అవుతుందని గమనించి బిగ్ బీ ముందు జాగ్రత్తగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తనకు.. తన కొడుకు అభిషేక్ బచ్చన్, భార్య జయా బచ్చన్ కు కేటాయించిన పెన్షన్ మొత్తాన్ని పేదలకు ఉపయోగించాలని.. తమ కుటుంబ కోరిక కూడా ఇదేనని అన్నారు. దీనిలో భాగంగా యూపీ సర్కారుకు ఓలేఖ కూడా రాయనున్నారట. మొత్తానికి బిగ్ బీ తొందరగానే మేల్కొని సమస్య జఠిలం కాకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు. కాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం క్రీడా, కళా రంగాలలో విశేషకృషి చేసిన వారిని గౌరవించేందుకు "యష్ భారతి సమ్మాన్" అనే పెన్షన్ పధకం ప్రారంభించింది. దీనిలో భాగంగానే బిగ్ బీ లాంటి గొప్ప నటులు తమ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమని అందుకే అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లను ఈ పెన్షన్ పధకానికి ఎంపిక చేసినట్లుగా రాష్ట్ర సాంస్క్రతిక శాఖ ప్రకటించింది.