అన్నం పెట్టారు... మాయమయ్యారు..
posted on May 3, 2017 2:56PM
.jpg)
బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడికి చక్కటి భోజనం పెట్టారు.. ఆతరువాత మాయమయ్యారు ఓ దంపతులు. అదేంటి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. పశ్చిమ బెంగాల్‌లో పర్యటనలో భాగంగా.. అమిత్ షా నక్సల్బరీలో భాగమైన కతియజోటే అనే గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన ఆయనకు మహాలీ తెగకు చెందిన రాజు మహాలీ, ఆయన భార్య గీత భోజనం వడ్డించారు. నేలపై పరిచిన చాపమీద కూర్చుని వారిద్దరు చెరో దిక్కున ఉండగా మధ్యలో కూర్చున్న అమిత్ షా పప్పన్నం, సలాడ్‌తో తృప్తిగా భోంచేసి వెళ్లారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. ఆ తరువాత రెండు రోజుల నుండి మహాలీ కుటుంబం కనిపించకుండా పోయింది. అసలు ఎక్కడికి వెళ్లారు.. వారికి ఎమైంది.. అన్నది మిస్టరీగా మారింది. మీడియాకి సైతం ఈ విషయం అంతుపట్టక.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. బీజేపీ నేత దిలీప్ బారుయి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారంట. మరో బీజేపీ అధ్యక్షుడు ప్రవీణ్ అగర్వాల్ స్పందిస్తూ టీఎంసీ నేత గౌతం దేవ్ వారిని కిడ్నాప్ చేశారంటూ ఆరోపించారు. మొత్తానికి ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా.. వీరిద్దరూ కనిపించకపోవడం మాత్రం పెద్ద మిస్టరీగా మారింది.