రాజ్యాంగ రూపశిల్పి అస్తమించిన రోజు!

అంబేద్కర్ పేరు వినని వ్యక్తి ఉండడు ఏమో. భారతదేశ స్థితి గతులను మార్చివేసిన వ్యక్తి అంబేద్కర్. ప్రజలు ఈయనను దేవుడితో సమానంగా కొలుస్తారు. విద్య, ఉద్యోగం, సమానత్వం మొదలైన ప్రతి విషయంలో అంబేద్కర్ ఒక స్ఫూర్తి తేజంగా అందరికీ ఆదర్శనీయుడు. దేశానికి ఎంతో చేసిన వ్యక్తి తన తనువు చాలించిన దినం డిసెంబర్ నెలలోనే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈయన ప్రజల కోసం చేసిన పోరాటం, త్యాగం, సేవ మొదలైన వాటిని గుర్తుచేసుకోవాలి. ఈయన వర్ధంతి సందర్భంగా ఈయన గురించి….

 డిసెంబర్ నెలలో ముఖ్యమైన రోజులలో అంబేద్కర్ వర్ధంతి కూడా  ఒకటి.  BR అంబేద్కర్ వర్ధంతి పరిస్థి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకుంటారు.  ఈయన భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపశిల్పిగా పరిగణించబడ్డాడు.  సమానత్వం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి గానూ  నేటి ప్రజలకు అవగాహన కల్పించడానికి  భారతదేశంలో డాక్టర్ BR అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకుంటారు. 

 బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈయన జీవితంలోకి తొంగి చూస్తే… 

 అంబేద్కర్ నాటి కాలానికి(ఎంతో అభివృద్ధి చెందినా నేటికి కూడా) అందరూ వెనుకబడిన వర్గంగా భావించే దళిత కులంలో జన్మించారు, ఈ కారణం వల్ల వారు అంటరానివారిగా పరిగణించబడ్డారు మరియు సామాజిక-ఆర్థిక వివక్షకు గురయ్యారు.  అంబేద్కర్ పూర్వీకులు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చాలా కాలం పనిచేశారు. ఈయన తండ్రి మోవ్ కంటోన్మెంట్ వద్ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.  చదువు నిమిత్తం పాఠశాలకు హాజరైనప్పటికీ, అంబేద్కర్, మరికొందరు కులం కారణంగా  ఇతర  పిల్లల నుండి వేరు చేయబడ్డారు. అంతే కాకుండా ఉపాధ్యాయులు కూడా దళిత కులమనే కారణంతో ఇలాంటి వారికి చదువు విషయంలోనూ ఇతర తరగతి గది కార్యకలాపాలలోనూ సహకారం అందించలేదు. పైగా వీరిని తరగతి గదిలో కూర్చోనివ్వడానికి అనుమతి నిరాకరించారు.

బాల్యమంతా ఇలాంటి పరిస్థితులు మధ్య సాగిన BR అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి.  భారతదేశంలోని వివిధ కులాల అభివృద్ధికి ఆయన అనేక పనులు చేశారు, ప్రధానంగా అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు.  భారతదేశంలోని నివాసితులందరికీ వారి కులాలతో సంబంధం లేకుండా  సరైన వనరులు కల్పించడంలో కృషి చేసారు. 

ఇలా వెనుకబడిన వారికోసం అంబెడ్కర్ చేసిన కృషి ఫలితంగా ఈయన వర్దంతి రోజున దేశం మొత్తం ఈయనను గుర్తుచేసుకుంటుంది.

ఇక  BR అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ సంవత్సరం 2022 డిసెంబర్6 న వివిధ ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే…

డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ మరణించి ఈ. సంవత్సరానికి 66 సంవత్సరాలు పోయిర్తయ్యి  67వ వర్ధంతి వచ్చింది.  దేశం మొత్తం మీద దీన్ని  మహాపరినిర్వాణ దివస్ గా పేర్కొంటారు.  ఆయన 67వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేయనున్నారు.

భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి అంబేద్కర్ వర్ధంతిలో కీలకంగా పాల్గొంటారు. వీరు  సమాజానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు కులతత్వాన్ని నిర్మూలించడంలో ఆయన చేసిన కృషి గురించి ఉపన్యాసాలు ఇస్తారు. 

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.  భారత రాజ్యాంగ పితామహుడిగా పిలువబడిన ఈయన సంఘ సంస్కర్తగా దేశానికి, సమాజానికి అతను చేసిన సేవలు వెలకట్టలేనివి. ఈ సేవలకు గానూ  1990లో భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను కూడా పొందాడు. ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈయనకు  తొమ్మిది భాషలు తెలుసు, అంతే కాకుండా  భారతదేశంలో డాక్టరేట్‌ను అభ్యసించిన మొదటి వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తికి పరిస్థి ఒక్కరూ నివాళులు అర్పించాలి..

                                       ◆నిశ్శబ్ద.