పోలీసులపై రెచ్చిపోయిన అంబటి.. లోపలికి వెళ్తే ఏం చేస్తావ్
posted on Jun 4, 2025 2:37PM

గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ఈ గొడవ చోటుచేసుకుంది. పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర వాగ్వాదన్నికి దిగారు. వైసీపీ నేతలు మూకుమ్మడిగా కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామని సీఐ చెప్పడంతో అంబటి పోలీసులపై ఉగ్రరూపం చూపించారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావో చేసుకో అని పోలీసులపై మండిపడ్డారు. అపుకోండి అని సీఐకి వేలు చూపిస్తూ హెచ్చారించారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే, ఓ పోలీస్ అధికారి అంబటి రాంబాబు తీరుపై నిప్పులు చెరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లింది. ఒకరికొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.