గణపతి హోమంతో అమరావతి శంకుస్థాపన శుభారంభం

 

అమరావతి శంకుస్థాపన జరుగుతున్న ఉద్దందరాయపాలెంలో కొద్దిసేపటి క్రితం గణపతి హోమం మొదలయింది. అనంతరం వివిధ హోమాలు, పూజలు నిర్వహిస్తారు. తరువాత మధ్యాహ్నం 12.36-12.43 గం.ల మధ్య శంఖుస్థాపన ప్రధాన క్రతువు జరుగుతుంది. ప్రధాని మోడీ స్వయంగా దానిలో పాల్గొని పూర్ణాహుతి, రత్నన్యాసం, శిలాన్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu