పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం..వైసీపీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్

 

తాను ఎప్పుడు రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలన చూశాక ఏపీకి అసలు వెలుగు వస్తుందా అని అనుకున్నా కూటమి సర్కార్ రాకుంటే ఆంధ్రప్రదేశ్ ఏమయ్యేదో అనిపించింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిన పెడుతున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అండగా ఉన్నారు అని తెలిపారు. వైసీపీ నేతలకు పవన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గొంతులు కోస్తామనే బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. అవన్నీ సినిమాల్లోనే బాగుంటాయని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదు. 

మేం చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా ఉంటున్నాం. ఎన్నో దెబ్బలు తిని, ఇక్కడి వరకు వచ్చాం. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం. ప్రజల్లో భయాందోళన కలిగించాలని చూస్తే సహించం’’ అని పవన్‌ హెచ్చరించారు. వైసీపీకి ప్రతిపక్షానికి కావాల్సిన సంఖ్య బలం కూడా లేదు.. కానీ ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఏకైక లక్ష్యంతో తామందరం కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని ప్రజలు గుర్తించి, ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆశీర్వదించారని తెలిపారు.ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించగలిగాం. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించింది. మేము గ్రామపంచాయతీలకు కేటాయించే నిధులను గణనీయంగా పెంచాం. పల్లెపండగ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి బాటలు వేశాం అని ఆయన వివరించారు.