నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చింది : లోకేశ్

 

గత పాలకులు విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేశ్ విమర్శించారు. ఏపీలో ఎన్డీయే కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు సదస్సులో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఎక్కువ మొత్తంలో పింఛను ఇస్తున్నామని. తల్లికి వందనం పేరుతో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. తొలి ఏడాదిలోనే డీఎస్సీ ద్వారా 16,300 పోస్టులు భర్తీ చేస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.పేదలకు చేయూత ఇచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ఏ రాష్ట్రానికి వెళ్లినా పీ-4 విధానాన్ని ప్రశంసిస్తున్నారు.

పొగాకు, మిర్చి, మామిడి, కోకో రైతులను ఆదుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు టీసీఎస్‌, కాగ్రిజెంట్‌ సంస్థలను తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది. అభివృద్ధిలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు దూసుకుపోతోందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోదు. ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు వేధింపులు గురిచేసే వారని లోకేశ్ పేర్కొన్నారు. నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రర్యం వచ్చిందని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు