ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన...


ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం నెలకొంది. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా, వర్షాభావ కరవు పరిస్థితులపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని తక్షణం చర్చకు తీసుకోవాలని వైకాపా డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అంతేకాదు మహిళల రక్షణ విషయంపై కూడా వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్ లోకి వెళ్లి ఆందోళనలు, నినాదాలు చేశారు. దీంతో వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.