పన్నీర్ సెల్వం దూకుడు.. దినకరన్ టెన్షన్..

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతంరం ఆర్కే నియోజక వర్గ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ స్థానానికి గాను పోటీ మామూలుగా లేదనిపిస్తుంది. ఒకపక్క పన్నీర్ వర్గం... మరోపక్క శశికళ వర్గం.. ఇంకోవైపు జయ మేనకోడుల దీపా. వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో శశికళ వర్గం నుండి పోటీకి దిగిన శశికళ అక్క కుమారుడు దినకరన్ తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలస్తోంది. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడుగా ముందుకు సాగుతుండుటమే దీనికి కారణం. పన్నీర్ సెల్వం.. ఆర్కే నగర్ స్థానం నుండి  మధుసూదనన్ ను బరిలోకి దింపారు. ఆర్కే నగర్ ఓటర్లకు మధుసూదనన్ సుపరిచితుడే. గతంలో ఒకసారి ఆయన ఇక్కడ నుంచే గెలుపొందారు. నియోజకవర్గంలోని ప్రతి వీధి, ప్రతి నాయకుడు మధుసూదనన్ కు తెలుసు. అంతే  కాదు, ఇప్పటికే ఆయన ఆ నియోజకవర్గంలోని ప్రతి నేతను టచ్ చేస్తున్నారు. వారి ఇంటికి వెళ్లి మరీ పలకరించి వస్తున్నారు. ఇది దినకరన్ ను కలవరపెడుతోంది. మరోవైపు దీపా కుమార్ కూడా గట్టి పోటి ఇస్తుందన్న నేపథ్యంలో ఇంకా టెన్షన్ పడుతున్నాడట.

 

ఇదిలా ఉండగా.. అక్రమాస్తుల కేసులో తాను జైల్లో ఉన్నప్పటికీ తాను జైల్లో ఉండే చక్రం తిప్పొచ్చు అని ఊహించిన శశికళ హవా కూడా కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది.  తనకు అనుగుణంగా పాలన కొనసాగిస్తాడనే భావనతో చిన్నమ్మ శశికళ ఆయనను సీఎం చేశారు. అయితే, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన వెంటనే పరిపాలనలో పళని తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇంత పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఎన్నిక వరకూ ఆగాల్సిందే.