అమలకి ఎక్కడో మండింది!
posted on Sep 24, 2012 5:15PM

అమలాపాల్ ని జర్నలిస్ట్ లు ఎట్టాపడితే అట్టా ఆడేసుకుంటున్నారంట. తానే స్వయంగా తన బ్లాగ్ లో ఈ విషయాన్ని వివరంగా పూసగుచ్చినట్టు ఆవేశపడుతూ చెప్పింది. “మీ ఇష్టమొచ్చినట్టు మీరు రాసేసుకుంటే ఎలా ఓ మాట నన్నడగొచ్చుగా” అంటూ ఈ అమ్మడు తన అక్కసునంతా వెళ్లగక్కింది. ప్రస్తుతం చేతిలో ఉన్న ఓ సినిమాకోసం చాలా స్లిమ్ కనిపించేందుకు ట్రైనర్ చెప్పినమాటల్ని తు.చ తప్పకుండా పాటిస్తూ అమల తెగ చిక్కిపోయింది. మరో సినిమాకోసం ఆ నిర్మాత కాస్త ఒళ్లు చేస్తే బాగుంటుందికదా.. అని అమలాపాల్ ని ఆదరంగా అడిగినట్టు కొన్నిచోట్ల ఒచ్చిన వార్తల్ని తను చాలా సీరియస్ గా తీసుకుంది. ఎట్టాపడితే అట్టా రాసేస్తారా.. ఒక్క క్షణంకూడా మా గురించి ఆలోచించరా అంటూ.. చెడామడా తనకు నచ్చనివాళ్లకు నాలుగు చీవాట్లు పెట్టడమే కాకుండా విలువలు, వలువల గురించి ఓ చిన్నసైజు ఉపన్యాసం కూడా ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా..