త్రిషకి అది కూడా పోయింది
posted on Jun 26, 2013 12:36PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు చేజారిపోతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు త్రిష కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అసలకే సినిమాలు లేక సతమవుతున్న త్రిషకు సడన్ గా హీరో సూర్య పక్కన నటించే ఛాన్స్ రావడంతో మళ్ళీ తనకు లక్కీ డేస్ మొదలయ్యాయని అనుకుంది త్రిష. కాని ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. ఇప్పుడు త్రిష అవకాశం అమలాపాల్ కి దక్కింది.
సూర్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో 'ద్రువ నక్షత్రం' అనే చిత్రం తెరకేక్కబోతుంది. అసలు ఈ సినిమాకి హీరోయిన్ గా ముందు అమలాపాల్ పేరే పరిశీలించారు. ఆ తరువాత ఎందుకనే త్రిషని ఎంచుకున్నారు. అయితే మళ్ళీ ఆ ఆఫర్ అమలాపాల్ కే దక్కడం చిత్ర మాయ. అలా..అమలాపాల్ ది త్రిషకి... త్రిష ది అమలాపాల్ కి దక్కింది.