అక్కినేని నాగేశ్వరరావు సతీమణి కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అన్నపూర్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 79 సంవత్సరాలు. అన్నపూర్ణ మృతితో అక్కినేని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అక్కినేనితో ఫిబ్రవరి 18, 1949 తేదిన అన్నపూర్ణ వివాహం జరిగింది. అన్నపూర్ణకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నాగార్జున, నిర్మాత వెంకట్ అక్కినేనిలు అన్నపూర్ణ కుమారులు. 2009 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు దంపతులు వివాహ వజ్రోత్సవం జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అన్నపూర్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. తన తల్లి మరణవార్తను తెలుసుకున్న సినీ నటుడు నాగార్జున హుటాహుటిన బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu