కసబ్‌ను ఉరి తీసిన తలారికి రూ.5 వేలు

 

Ajmal Kasab hanged, Ajmal Kasab death, kasab hanged till death, India hangs Mumbai gunman Ajmal Kasab

 

ఎరవాడ జైల్లో అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన తలారికి అధికారులు రూ.5 వేలు చెల్లించారు. గతంలో.. దోషులను ఉరితీసే తలారికి రూ.10 చొప్పున చెల్లించేవాళ్లం. ఇప్పుడు ఆ మొత్తం రూ.5 వేలు. నిజానికి.. తమకు అవకాశం ఇస్తే కసబ్‌ను ఉచితంగా ఉరి తీస్తామంటూ పలువురి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అనుభవం ఉన్న వ్యక్తి ఈ పని చేస్తే మంచిదని మేం భావించాం... అని మహారాష్ట్ర హోం మంత్రి పాటిల్ తెలిపారు. కసబ్‌ను ఉరి తీసింది ఎవరో చెప్పడానికి మాత్రం అధికారులు నిరాకరించారు. అతడి వివరాలను గోప్యంగా ఉంచారు. కసబ్ కంటే ముందు 1995లో ఓక వ్యక్తిని ఉరి తీసినట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మహారాష్ట్రలో ఇప్పటి వరుకు 17మంది దోషులను ఉరి తీసినట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu