ఎస్ నెక్ట్స్ జెన్ సంస్థ డైరెక్టర్ ను ఆరాతీసిన ఎసిబి 

ఫార్ములా ఈ రేస్ కేసులో శనివారం ఎస్ నె క్ట్స్ జెన్ సంస్థ ప్రతినిధులను ఎసిబి విచారణ చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ అనిల్ విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ చేశారు. ఈ రేస్ నిర్వహణ ఎస్ నెక్ట్స్ జెన్ చేయాల్సి ఉండగా మరో సంస్థ కార్ రేస్ కు సంబంధించి అనుమతులు పొందేందుకు సంబంధించిన పత్రాలు సమర్పించారు. దీనిపై ఎసిబి అధికారులు లోతుగా  ఆరాతీశారు.