ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు

 

ఇప్పటికే అప్ పార్టీలోని నేతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా మరో సమస్య వచ్చిపడింది. నిన్న రాత్రి ఆప్ పార్టీ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ పై కాల్పులు జరగడంతో కలకలం రేగింది. వివరాల ప్రకారం వేద్ ప్రకాశ్ ఈశ్వర్ కాలనీలో ఉన్నకార్యాలయం వద్ద ఉండగా గుర్తు తెలియని దుండగులు కొందరు అతనిపై కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ఆప్ పార్టీలోని నేతలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu