పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  అగ్ని మాపక సిబ్బంది నిన్నటి నుంచి మంటలనార్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మదీనా సమీపంలోని దివాన్ దేవ్ డి ప్రాంతంలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  రంజాన్ సందర్బంగా దివాన్ దేవిడీకి భారీగా  కొత్త స్టాక్ వచ్చింది. ఈ స్టాక్ అంతా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.   మదీనా అబ్బాస్ టవర్స్ లో  సోమవారం మంటలు వ్యాపించి  చుట్టుపక్కల బిల్డింగ్ లకు పాకింది. 10 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu