బీరుట్ పేలుళ్ల నేపథ్యంలో.. అమోనియం నైట్రేట్ చెన్నై నుండి హైదరాబాద్ తరలింపు 

కొద్ది రోజుల క్రితం లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని నౌకాశ్రయంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వ‌లు సృష్టించిన బీభ‌త్సంలో వందకుపైగా మృతి చెందగా.. వేలాది మంది ఆస్ప‌త్రుల పాలు అయ్యారు. తాజాగా ఇండియాలో భద్రతా చర్యల్లో భాగంగా చెన్నైనౌకాశ్రయంలో లో నిల్వ ఉంచిన 697 టన్నుల అమోనియం నైట్రేట్ ను ఈ-వేలం ద్వారా హైదరాబాద్ కు చెందిన వ్యాపారి కొనుగోలు చేయడంతో దాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

తమిళనాడులోని చెన్నై పోర్టుకు భారీ ఎత్తున దిగుమతి అయిన అమోనియం నైట్రేట్ ను 2015లో కస్టమ్స్ యాక్ట్ 1962 కింద సీజ్ చేయగా అప్పటి నుంచి దాన్ని నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక గోడౌన్ లో నిల్వ ఉంచారు. తమిళనాడుకు చెందిన ఓ దిగుమతిదారు, ఎరువుల తయారీ నిమిత్తం ఇంపోర్ట్ చేసుకుంటున్నాని అనుమతి తీసుకుని, దక్షిణ కొరియా నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నాడు. అయితే, ఇది ఫర్టిలైజర్ గ్రేడ్ కాకుండా ఎక్స్ ప్లోజివ్ గ్రేడ్ రూపంలో ఉందని గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతని దిగుమతి అనుమతులు రద్దు చేశారు.

 

ఐతే తాజాగా బీరుట్ పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిని అధికారులు ఈ వేలం వేశారు. దీన్ని హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేయడంతో దాని తరలింపు ప్రక్రియ చేపట్టారు. భద్రతా సంస్థలు సూచించిన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని ఈ రసాయనాన్ని హైద‌రాబాద్‌కు ర‌వాణా చేస్తున‌ట్టుగా అధికారులు చెప్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News