మహాకుంభ్ లో ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భక్త జనం పోటెత్తుతున్నారు. శుక్రవారం నాటికే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరువైంది.  మామూలుగా 12ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలుగా కాకుండా  మహాకుంభమేళా 144 సంవత్సరాల తరువాత వచ్చింది. 40 రోజులు పాటు సాగే ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మహా శివరాత్రితో ముగియనున్న కుంభమేళా గడువు దగ్గరపడుతుండటంతో భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది. 

హిమాలయాలనుంచి కూడా సాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడం విశేషం. దేశం,విదేశాల నుంచి కూడా కుంభమేళాకు తరలి వస్తున్నారు.  విమానాలు,రైళ్లు,బస్సులు,కార్లు ఇలా ఏ వాహనం దొరికితే దానిలో ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు భక్తులు.  వాహనాలతో వందల కి.మీ ట్రాఫిక్ జామ్ అవుతున్నది.  భారతదేశ జనాభా 145 కోట్లలో హిందువులు 110 కోట్లకు పైగా ఉన్నారు.వారిలో సగం మందికి పైగా ఇప్పటికే మహాకుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu