కరోనా వచ్చినా.. కళ్యాణం ఆగదు

కక్కొచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదు అనేది నానుడి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దీన్ని కాస్త మార్చి కక్కోచ్చినా.. కరోనా వచ్చినా కళ్యాణం ఆగదు అని చెప్పుకోవచ్చేమో..

 

కరోనా కాలంలో ఖర్చులు కలిసివస్తాయని అనుకున్నారేమో తమిళనాడులో పెళ్ళిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో రెండువందల పెళ్ళిళ్లు జరగడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కేవలం వధువరుల సమీప బంధువులతోనే నిరాడంబరంగా పెండ్లివేడుక ముగిస్తున్నారు. తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో శుక్రవారం ఒక రోజే రెండువందల పెళ్ళిళ్లు జరిగాయి. మధురై, కడలూరు, మురుగన్ ఆలయాల్లో 50కి పైగా పెళ్ళిళ్లు జరిగాయి. 

 

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న ప్రస్తుతం సమయంలో పెళ్ళికి ఏమోచ్చింది అంత తొందర అంటూ మరికొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి శ్రావణమాసంలో వేలాది పెళ్ళిళ్లు అయ్యేవి.. కరోనా కారణంగా చాలావరకు ఆగిపోయాయి అంటున్నారు మరికొందరు. ఏదీఏమైనా కరోనా వచ్చినా కావల్సిన కళ్యాణం కాకమానదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu