నేడు ఎన్టీఆర్ 17వ వర్థంతి
posted on Jan 18, 2013 9:49AM

దివంగత ముఖ్యమంత్రి, భారతదేశం గర్వించదగిన గొప్ప నటుడు, దర్శకనిర్మాత నందమూరి తారక రామారావు గారి 17వ వర్ధంతి నేడు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా 1982 లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎకచ్చత్రాధిపత్యానికి తెరదించారు. 302 సినిమాల్లో నటించిన ఎన్టీఆర్.. తన పాలనలో చేపట్టిన పథకాలను వేర్వేరు పేర్లతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి అమలు చేస్తూ తమ పేర్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పిన తక్కువేనని చెప్పని వాళ్ళెవ్వరూ ఉండరంటే అతిశయక్తి కాదేమీ..!
నందమూరి తారక రామారావు గారి 17వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద ఆయన కుటుంబసభ్యులంతా నివాళు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, దగ్గుబాటి దంపతులు, బాలకృష్ణ, హరికృష్ణ ,రామకృష్ణ మోహనకృష్ణ తదితరులు ఎన్టీయార్ కు ఘనంగా నివాళులర్పించారు.