‘మహా’ విషాదం.. ముంబైలో భవనం కూలి 14 మంది మృతి
posted on Aug 28, 2025 9:20AM
.webp)
ముంబై సమీపంలో బహుళ అంతస్తుల నివాస భవనం కుప్పకూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగంతస్తుల నివాస భవనం నాలుగో అంతస్తు వెనుక భాగం మంగళవారం (ఆగస్టు 27) అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది.
ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఇళ్ల సముదాయం మీద పడ్డాయి. పోలీసులు, వసాయ్ విరార్ మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక సిబ్బంది, రెండు జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు యుద్ధ ప్రతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 11 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా కాపాడారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.