కరోనాను జయించిన వందేళ్ల బామ్మ

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలోని గౌహతిలో వందేళ్ల బామ్మ మాయి హందిక్యూ ఒకరు కరోనాపై విజయం సాధించారు. మహమ్మారి సోకినంత మాత్రాన భయాందోళనలకు గురై అభద్రతా భావానికి లోను కావద్దని ధైర్యంగా పోరాడాలని సందేశాన్ని ఇచ్చారు. అసలు వివరాల్లోకి వెళితే...

గౌహతిలోని ఒక వృద్ధాశ్రమంలో సెప్టెంబర్ 7న ఇద్దరు మహిళలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. అందులో ఒకరికి 75 సంవత్సరాలు. మరొకరు 100 ఏళ్ల బామ్మ.‌ ఇద్దరిని నగరంలోని మహేంద్ర మోహన్ చౌదరి కొవిడ్-19 ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు, నర్సులు వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. బుధవారం ఇద్దరికీ టెస్టులు చేయగా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.వాళ్ళిద్దరు తిరిగి వృద్ధాశ్రమానికి చేరుకున్నారని ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu