టీఆర్ఎస్ కు టిడిపి మద్దతు: ఎర్రబెల్లి

 

 

 Yerrabelli Dayakararao, Yerrabelli Dayakararao Telangana, telangana issue tdp, congress tdp

 

 

సహకార ఎన్నికల్లో తెలంగాణ లో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరావు సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటనతో ఇతర పార్టీల్లో, టిడిపిలోను ఉత్కంఠ నెలకొంది.


ఎర్రబెల్లి మీడియాతో మట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నందుకే సహకార ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ మొదట్నించి మోసం చేసిందని, విద్యార్థుల చావుకు వారే కారణమని ఎర్రబెల్లి విమర్శించారు. పదవులకన్నా తెలంగాణ ముఖ్యమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇది ఎర్రబెల్లి వ్యక్తగత అభిప్రాయమని ఈ ప్రకటనపై తమకేమీ తెలియదని టీడీపీ తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu