మహేష్ బాబు ఇంట్లోకి ఆగంతకుడు

 

 

 

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడి చోరికి ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి ముఖానికి మంఖీ క్యాప్ ధరించి వెనకనుండి అద్దం పగలగొట్టుకుని నేరుగా మహేష్ బాబు బెడ్ రూంలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించాడు. అలికిడి విన్న పని మనుషులు, భద్రతా సిబ్బంది అక్కడికి రావడంతో వచ్చిన దారినుండే పారిపోయాడు. ఇంటి వెనుక ఉన్న కిటికీ అద్దాలను పగులకొట్టి సెక్యూరిటీ వారి కళ్లు కప్పి లోనికి వచ్చినట్లు చెబుతున్నారు. అంటే సినిమాలో మాదిరే ఇతడు చోరికి యత్నించినట్లు కనబడుతోంది.


 
విషయం తెలుసుకున్న మహేష్ బాబు పోలీసులకు పిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. కిటీకీపై పడ్డ వేలిముద్రలను సేకరించారు. ఐపీసీ సెక్షన్ 457, 511 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu