రైతులకు సీఎం మద్దుతు... ప్రధానితో మాట్లాడతా..!

 

తమ సమస్యలను  పరిష్కరించాలని... రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది నెలలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో రకంగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి మద్దతు పలికారు. ఈరోజు ఉదయం జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేస్తున్న రైతులను కలిసిన పళనిస్వామి.. రైతుల ఆందోళనను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కరానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దీనికి గాను రైతులు ప్రధానితో భేటీ అనంతరమే ఆందోళన విరమించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu