తలసాని గెలవడం కష్టమే? 

మంత్రి తలసానికి స్వంత పార్టీలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సనత్ నగర్  అసెంబ్లీ      నియోజకవర్గం నుంచి గెలుపొందిన తలసానికి ద్వితీయ శ్రేణి నేతల నుంచి మద్దత్తు కరవయ్యింది. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోస్తున్న తమకు కనీసం నామినేటెడ్ పోస్టులు దక్కకుండా తలసాని అడ్డుకుంటున్నాడని ద్వితీయ శ్రేణి నేతలు ఆరోపిస్తున్నారు.

గత పార్లమెంటు ఎన్నికల సమయంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచే బిజెపి వోట్లుఎక్కువయ్యాయి. ఈ కారణంగా సికింద్రాబాద్  నుంచి బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపొందారు. తలసాని ప్రాతినిద్యం వహిస్తున్న సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం  ప్రజలు బిజెపి అభ్యర్థి విజయానికి కారకులయ్యారు. 
 గత అసెంబ్లీ ఎన్నికలలో       సనత్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి  ఓడిపోయిన కూన వెంకటేశ్ గౌడ్ బిఆర్ఎస్ లో చేరినప్పటికీ అతనికి నామినేట్ పోస్టులు రాకుండా తలసాని అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తలసానితో వేగలేక కూన తిరిగి టీడీపీలో చేరారు. 
కాగా తలసాని కుమారుడి జోక్యం పార్టీలో పెరిగిపోతుందని ఆరోపించే వారు ఎక్కువయ్యారు. భూ కబ్జాలు, సెటిల్ మెంట్స్ లో తలసాని కుమారుడి పాత్ర ఎక్కువయ్యిందని  ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తలసానికి పట్టు ఉన్న రెజిమెంటల్ బజార్  వంటి ప్రాంతాల్లో బిఆర్ఎస్ వోట్లు పడడం కష్టమేనన్నారు.