కేంద్రమంత్రి నటన

సినిమా ఇండస్ట్రీకి... రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన లిస్టు చాలా పెద్దది. ఎక్కడి దాకో ఎందుకు మహానటుడు ఎన్టీఆర్ అక్కడ్నుంచి వచ్చి పాలిటిక్స్ ను శాసించే స్థాయికి ఎదిగారు. ఆయనలా రాజకీయాల్లో సక్సెస్ అయిన నటుడు మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ప్రస్తావనే ఇప్పుడు ఎందుకనే కదా మీ అనుమానం.. ఇప్పుడు ఓ కేంద్రమంత్రి కూడా నటనకు సిద్ధమవుతున్నారు. కేంద్రమంత్రి సినిమాల్లో నటించడమేంటని ఆశ్చర్యపోకండి.. ఆమె వచ్చిందే సినీ రంగం నుంచి. ఆమె ఎవరో కాదు స్మ్రితి ఇరానీ. కేంద్రమంత్రిగా ఫుల్ బిజీగా ఉన్న ఆమె కొంచెం తీరిక చేసుకొని ఓ సినిమా నటించబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఆమె ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారామె. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందట. కేంద్రమంత్రిగా ఫుల్ బిజీగా ఉన్న ఆమె వీకెండ్ లోనే నటించాలని నిర్ణయించుకున్నారట. ఎందుకంటే అటు పొలిటికల్ లైఫ్ కు.. ఇటు సినీ కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu