హీరో సిద్దార్థ్ ను కావాలన్న సమంత..!
posted on Feb 21, 2013 3:54PM

'జబర్ దస్త్' సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సిద్దార్థ్, సమంతాల మధ్య ఎఫైర్ నడుస్తుందని ఫిల్మ్ నగర్ లో టాక్. ఈ విషయం పై ఇప్పటి వరకు సమంత కాని సిద్దార్థ్ ఏమి కామెంట్ చేయలేదు. అయితే 'జబర్ దస్త్' డైరెక్టర్ నందిని రెడ్డి మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టింది.
అదేమిటి అంటే..'జబర్ దస్త్' కోసం సమంత డేట్స్ కావాలని నందిని రెడ్డి నిత్య మీనన్ ని సంప్రదించింది. నిత్య డైరెక్ట్ గా సమంతతో మాట్లాడి సినిమా చేయడానికి ఒప్పించిందట. అప్పటికి ఇంకా హీరో ఫైనల్ కాలేదు. హీరో కోసం నందిని రెడ్డి వెతుకుతుండగా సిద్దార్ద్ అయితే బాగుంటాడు..అతనిని పెట్టుకోవాలని సమంత సూచించిందట. సిద్ధార్థ్ పేరునే సమంత ఎందుకు రిక్వెస్ట్ చేసిందని అందరూ సందేహ పడుతున్నారు. అయితే సమంత దీనిపై ఏమైనా కామెంట్ చేస్తుందో లేదో చూడాలి.