రాజకీయ నేతలు ఇడియట్స్: సీఎన్ఆర్ రావు

 

 

 

భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు (చింతామణి నాగేశ రామచంద్రరావు ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలను 'ఇడియెట్స్' అని అంటున్నారు. భారతదేశంలో సైన్స్‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యకూ శాస్త్రీయ పరిశోధనలకూ కేటాయించే నిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "విద్యారంగంలోనూ, సైన్స్ రంగంలోనూ మనం మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. సెన్సెక్స్, వ్యాపారం బాగున్నంతమాత్రన దేశం బాగున్న ట్టు కాదు. ఈ ప్రభావం ఐదు-పదేళ్లపాటు మాత్రమే ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో పరిస్థితి ఏమిటి? సైన్స్‌లో ప్రగతితోనే భవిష్యత్ భద్రత సాధ్యం'' అని రావు స్పష్టం చేశారు.

 

 

రాజకీయనాయకులపైనే కాదు.. ఐటీ రంగంపైనా సీఎన్ఆర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐటీ అనేది అసలు సైన్సే కాదని.. అది కొందరు డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతోందని అన్నారు. అంతేకాదు.. ఐటీ రంగంలో చాలా మంది అసంతృప్తితో పనిచేస్తున్నారంటూ ఇటీవలికాలంలో పేపర్లలో వస్తున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. ఐటీ ఉద్యోగులను అసంతృప్త గుంపుగా అభివర్ణించారు.

VIdeo Courtesy: TV9