యువకుడిని కొట్టిన రామ్ చరణ్
posted on May 5, 2013 6:09PM
.jpg)
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ ఈ రోజు ఓ యువకునిపై చేయి చేసుకున్నట్లు తెలియవచ్చింది. బంజార్‌హిల్స్ సిటీ సెంటర్ వద్ద రామ్ చరణ్ కారును ఇద్దరు యువకులు దాటి వెళ్ళారని, మా కారునే ఓవర్‌టేక్ చేస్తారా అంటూ వారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఒక యువకుని చొక్కా చిరిగి, గాయాలయ్యాయి. రామ్ సెక్యూరిటీ కూడా వారిపై దాడి చేసినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేపు సమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు యువకులు మీడియాకు తెలిపారు. తాము ఏ తప్పు చేయలేదని, ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని వారు పేర్కొన్నట్లు తెలియవచ్చింది. అది రామ్ చరణ్ కారని తమకు తెలియదని, అనవసరంగా తమపై దాడి చేశారని వారు తెలిపారు.